టీ20 తొలి మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

  • భారత్-వెస్టిండీస్ మధ్య మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్
  • కోల్ కతా వేదికగా ఈరోజు తొలి మ్యాచ్
  •  ప్రస్తుతం టీ20 ఛాంపియన్ గా ఉన్న విండీస్ జట్టు
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 కోల్ కతా వేదికగా కాసేపట్లో జరగనుంది. టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈరోజు జరగనుంది. కాగా, ప్రస్తుతం టీ 20 ఛాంపియన్ గా ఉన్న వెస్టిండీస్ జట్టు తన ఆధిక్యాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. టెస్ట్, వన్డే సిరీస్ లు ఓడిన వెస్టిండీస్ జట్టు.. టీ20 ఫార్మాట్ లోనైనా భారత్ పై ఆధిక్యం సాధించాలని కృషి చేస్తోంది.    
Go Back to Shorts
kolkata
india vs westindies
1 t20

More Telugu News